Jatadhara | హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా చేసే యాక్టర్లలో ఒకరు టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు (Sudheer babu). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జటాధర (Jatadhara). వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan) కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా మేకర్స్ తాజాగా ఈ మూవీ సాంగ్ అప్డేట్ అందించారు.
ఈ విజయదశమి అక్టోబర్ 1 ధన పిశాచి వస్తుంది. చెడు నయా అవతారాన్ని చూసేందుకు రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ సోనాక్షి సిన్హా పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే ఇందులో సోనాక్షి సిన్హా డబ్బు పిచ్చి ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తాజా లుక్‌తో సినిమాపై హైప్ అమాంతం పెంచేస్తున్నారు మేకర్స్.
ఇటీవలే ఈ మూవీ నుంచి సోల్ ఆఫ్ జటాధర ట్రాక్ ప్రోమోను విడుదల చేయగా.. ఓం నమ : శివాయ్ అంటూ సాగుతున్న ప్రోమో గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్లలో ఓ వైపు శివుడు మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శిల్పా శిరోద్కర్ కీలక పాత్రలో నటిస్తోంది.
This Vijayadashami, confront the new face of evil as Dhana Pisachi arrives on 1st October 🔥
Witness #Jatadhara in theatres from Nov 7th 2025 in Telugu & Hindi 🪔#JatadharaOnNOV7#AwakeningBegins#UmeshKrBansal #PrernaArora @zeestudios_ @zeestudiossouth @shivin7 #ArunaAgarwal… pic.twitter.com/F8R3DI7UvT
— BA Raju’s Team (@baraju_SuperHit) September 28, 2025
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?