Nagarjuna | ఈ ఏడాది కుబేర, కూలీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున. నాగ్ ఇటీవలే కూలీ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన విషయం తెలిసిందే. ఇక నాగార్జున కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోయే 100వ ప్రాజెక్ట్‌పై కొత్త అప్డేట్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని మూవీ లవర్స్‌తోపాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసం నాగ్ వందో సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) డైరెక్ట్ చేయబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ మూవీని నాగార్జున 2026 మే నెలలో సమ్మర్ కానుకగా అభిమానుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో నాగ్ 100 సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై స్పష్టత రానుంది.
యూనిక్ స్టోరీ టెల్లింగ్, థ్రిల్లింగ్ కథనాలతో తనదైన మార్క్ చూపించే రా కార్తీక్ నాగార్జున కెరీర్ మైల్స్టోన్ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. ఇంతకీ రా కార్తీక్ నాగ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశాడు. కూలీలో తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన నాగార్జున మరి రా కార్తీక్‌తో ఎలాంటి కథ చేయబోతున్నాడన్నది అందరిలో ఉత్కంఠ నెలకొంది.
A. R. Rahman | పొన్నియన్ సెల్వన్ పాటపై కాపీ రైట్ కేసు.. ఏఆర్ రెహమాన్‌కు ఊరట
Ananthika Sanilkumar | సందీప్ వంగా చిత్రంలో ‘8 వసంతాలు’ భామ.?
Rani Helps Shah Rukh | రాణి సాయం తీసుకున్న షారుఖ్.. వీడియో వైరల్