Imanvi | తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడమంటే ఎవరికైనా చాలా ప్రత్యేక విషయమనే చెప్పాలి. అందులోనా మొదటిసారే పాన్ ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లున్న ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటించే అవకాశం వస్తే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాంటి అవకాశాన్నే కొట్టేసి ఓవర్‌నైట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది ఇమాన్వీ. హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుందని తెలిసిందే.
ఈ భామ నెట్టింట ఎలాంటి అప్డేట్ షేర్ చేస్తుందా అని ఎదురుచూస్తున్న ఫాలోవర్ల కోసం కొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ భామ ప్రస్తుతం హైదరాబాద్‌లో షికారు చేస్తోంది. ఫ్లోరల్ పంజాబీ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఇమాన్వీ నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో (సమాధులు) సరదాగా చక్కర్లు కొట్టింది. చారిత్రక కట్టడాల ముందు నిలబడి కెమెరాకు ఫోజులిచ్చింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
చాలా రోజులుగా ఇలా నెట్టింట కనిపించిన ఇమాన్వీ మరి ఫౌజీకి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఇస్తుందా..? అంటూ ఎదురుచూస్తున్నారు ఫాలోవర్లు, నెటిజన్లు.
A. R. Rahman | పొన్నియన్ సెల్వన్ పాటపై కాపీ రైట్ కేసు.. ఏఆర్ రెహమాన్‌కు ఊరట
Ananthika Sanilkumar | సందీప్ వంగా చిత్రంలో ‘8 వసంతాలు’ భామ.?
Rani Helps Shah Rukh | రాణి సాయం తీసుకున్న షారుఖ్.. వీడియో వైరల్