Kayadu Lohar | శ్రీవిష్ణు నటించిన అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది అస్సామీ సుందరి కయాదు లోహర్ (Kayadu Lohar) . ఈ ఏడాది ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్‌తో సినిమా చేస్తుందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. అంతేకాదు కామెడీ చేయడం ఎంత కష్టమో చెప్పింది కయాదు లోహర్.
నేను అనుదీప్ డైరెక్షన్లో వస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నా. ఈ మూవీ పూర్తిగా కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సినిమాలోని చాలా డైలాగ్స్ షూటింగ్ స్పాట్లో ఆలోచించి రాసినవే. ప్రతీ ఐదు నిమిషాలకోసారి వచ్చే సీన్ కొత్తగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందంటూ చెప్పుకొచ్చింది కయాదు లోహర్. కామెడీ చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే నేను అనుదీప్ సార్‌తో ఓ సినిమా చేస్తున్నా. కామెడీ చాలా కష్టమని తెలుసుకున్నా. ఎందుకో నాకు తెలియదు కానీ దానికి భాష కూడా ముఖ్యమే. మీకు భాష తెలిసినప్పుడు దాని అర్థమేంటో.. ఆ సంస్కృతి ఏంటో మీకు తెలుస్తుంది. తద్వారా కామెడీ కూడా సహజంగానే వస్తుంది.
సంస్కృతితోపాటు ప్రేక్షకుల నాడి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నాకు నవ్వించే స్వభావం ఉందని నమ్ముతా. కానీ కామెడీ చేయాల్సి వస్తే మాత్రం అది చాలా కష్టమైన పని. అది షూటింగ్ చేసేటప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. ప్రతీ పంచ్ సరిగ్గా వేయాలి.. ప్రతీ టేక్‌ను సరైన విధంగా వచ్చేలా చూసుకోవాలి. కామెడీ అనేది స్క్రిప్ట్‌పై ఆధారపడే కాకుండా స్పాట్లో ఆయన (అనుదీప్)చాలా డైలాగ్స్‌తో రాస్తుంటారు. నాకు ఒక డైలాగ్ ఉందంటే మళ్లీ ఐదు నిమిషాల తర్వాత మరో డైలాగ్ వస్తుంటుంది. ఈ సంభాషణలు, కామెడీ ప్రతీ సారి కొత్తగా మారుతూనే ఉంటాయి. ఒక నా భాష (అస్సామీ)లో కామెడీ చేస్తే అంత కష్టం కాదు. కానీ వేరే భాషలో చేయాలంటే చాలా కష్టం అంటూ చెప్పుకొచ్చింది కయాదు లోహర్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇంతకీ అనుదీప్ కయాదు లోహర్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కయాదు లోహర్ 2021లో ముగిల్పేట అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళంలో పాథోన్పథం నూట్టుండు సినిమాలో నటించిన ఈ బ్యూటీ అనంతరం శ్రీ విష్ణు సరసన ‘అల్లూరి’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు మరాఠీలో కూడా నటించింది.
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో
Imanvi | చారిత్రక ప్రదేశాల్లో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ షికారు
Nagarjuna | నాగార్జున 100వ సినిమా డైరెక్టర్ ఇతడే.. అప్పుడే రిలీజ్ ప్లాన్ కూడా..?