బూర్గంపహాడ్, ఏప్రిల్ 14 : ఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరహార దీక్షలు మంగళవారం 20వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో కన్వీనర్ సానికొమ్ము రామచంద్రారెడ్డి, సభ్యులు శ్రమ శక్తి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (BRTU) అధ్యక్షుడు కుందూరు పెద్దిరెడ్డి, జనరల్ సెక్రటరీ సింగరపు సతీష్, కందాల వెంకట్ రెడ్డి, చుక్కపల్లి బాలాజీ దీక్షలో పాల్గొన్నారు. వారికి కాంట్రాక్ట్ కార్మికులు పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కార్మికుల వేతన ఒప్పందం చర్చలు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీతో జరిపించాలని, లేని పక్షాన అతి త్వరలో సమ్మెకు వెళ్లే ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీక్ష శిబిరం వద్ద నేడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి సేవలు స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, ప్లాంటేషన్ మహిళా కార్మికులు పాల్గొన్నారు.