హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, వరంగల్, విజయవాడలోని ప్రముఖ బంగారం దుకాణాలు, వాటి యజమానుల ఇండ్లలో గత రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు నిర్వహిస్తున్న సోదాలు శుక్రవారం మూడో రోజు కూడా కొనసాగాయి. పన్ను చెల్లింపుల్లో బంగారం వర్తకులు భారీగా అవకతవకలకు పాల్పడినట్టు అనుమానిస్తున్న ఐటీ అధికారులు..
ప్రధానంగా క్యాప్స్ గోల్డ్ కంపెనీకి చెందిన చందా శ్రీనివాసరావు, చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్, అబిడ్స్, సికింద్రాబాద్లో ముమ్మరంగా సోదాలు కొనసాగుతున్నాయి. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి వాసవి రియల్ ఎస్టేట్ సంస్థతో అనుబంధం ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు.