సిరిసిల్ల : తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ( Kaleshwaram ) ప్రాజెక్టులో బాగమైన అన్నారం( Annaram ), సుందిళ్ల ( Sundilla ) ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ క్లీన్చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి (Jeevan Reddy ) పేర్కొన్నారు.
అన్నారం, సుందిళ్ల ఎక్సలెంట్, గుడ్ అని రిపోర్ట్ ఇచ్చిందని రిపోర్ట్ తో నైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కళ్లు తెరవాలని హితవు పలికారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం లోకి తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎల్‌నినోతో రాబోయే పంట కాలంలో సాగు నీటి కి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నాయని అన్నారు.
రెండు నెలల క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కన్నెపల్లి పంపు హౌజ్ ను సందర్శించి, సాగు నీరు, తాగు నీటికి వచ్చే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వానికి సూచించా రని పేర్కొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగం లోకి తెస్తే కేసీఆర్ కు పేరొస్తుందని ప్రభుత్వ భేషజాలకు పోతుందని విమర్శించారు.కన్నెపల్లి నుంచి వృథాగా దిగువన నీరు పోతున్నదని, చంద్రబాబు కోసం గురు దక్షణగా నీటిని రేవంత్ రెడ్డి అందజేస్తున్నారని విమర్శించారు. కన్నెపల్లి పంపు హౌజ్ వద్ద రూ.100 కోట్ల తో కాఫర్ డ్యాం కట్టి వినియోగంలోకి తేవాలని సూచించారు. కేసీఆర్ దూర దృష్టితో కాళేశ్వరం కట్టారని గుర్తు చేశారు.