AP News | జగన్ అడుగుపెడితే అరాచకం.. నోరు తెరిస్తే అబద్ధం : మంత్రి పార్థసారథి
AP News | వైసీపీ అధ్యక్షుడు జగన్ అడుగుపెడితే అరాచకం, నోరు తెరిస్తే అబద్ధమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీని భ్రష్టుపట్టించిన ఘోరాలను కప్పిపుచ్చుకోవడానికే నేడు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్సీపై జగన్, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
AP News : వైసీపీ అధ్యక్షుడు జగన్ అడుగుపెడితే అరాచకం, నోరు తెరిస్తే అబద్ధమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీని భ్రష్టుపట్టించిన ఘోరాలను కప్పిపుచ్చుకోవడానికే నేడు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్న మెగా డీఎస్సీపై జగన్, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 కుంభకోణంపై హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన నివేదికపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అని మంత్రి సవాల్ విసిరారు. ‘నాడు గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించినట్లే, నేడు ఏపీపీఎస్సీ స్కామ్‌ను కప్పిపుచ్చుకోవడానికి మెగా డీఎస్సీపై బురదజల్లడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీపై వైసీపీ నేతలు 300 కేసులు వేయగా.. వాటి వెనుక కుట్ర ఉందని న్యాయస్థానమే అభిప్రాయపడింది’ అని పార్థసారథి గుర్తుచేశారు.
వైసీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా గ్రూప్-1 పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లో కాకుండా ప్రైవేట్ రిసార్టుకు తరలించి తమకు అనుకూలమైన వారితో మూల్యాంకనం చేయించారని మంత్రి ఆరోపించారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, రోజువారీ కూలీలు, పరీక్ష రాసిన వారి కుటుంబ సభ్యులతోనే పేపర్లు దిద్దించినట్లు సిట్ నివేదికలోనే బట్టబయలైందన్నారు. జవాబు పత్రాల్లో విచ్చలవిడిగా వైట్నర్ వాడటం, డూప్లికేట్ ఓఎంఆర్ షీట్లు సృష్టించడం ద్వారా అర్హులైన పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 95 శాతం మంది పేపర్లలో తీవ్ర అవకతవకలు జరిగాయని, 89 పత్రాల్లో ఎగ్జామినర్ సంతకాలు కూడా సరిపోలలేదని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతోనే 16,347 ఉద్యోగాలతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారని పార్థసారధి తెలిపారు. పెట్టుబడులు ఆకర్షించి ప్రైవేట్ రంగంలో లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తూ, ఏటా పారదర్శకంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ 2nd ODI | భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన న్యూజిలాండ్.. 134 పరుగులకే ఆలౌట్!
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

