ఎక్కడైనా కష్టం ఉంది అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందించడం సోనూసూద్ అలవాటు. అవసరంలో ఉన్నవారి కోసం ఇప్పటికి దాదాపు రూ. 30 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈయన చేసిన మంచి పనులే కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే సోనూసూద్‌కు అవకాశాలు చాలానే ఇస్తున్నారు. దానికితోడు రూ.3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా రావడంతో హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే హైదరాబాద్‌లో ఓ సొంతింటిని కొనుక్కోవాలని చాలా రోజుల కింద ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే బంజారాహిల్స్‌లో రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నట్టు సమాచారం.
సోనూసూద్‌కి ఇప్పటికే ముంబైలో ఓ ఇల్లు ఉంది. అక్కడే ఒక హోటల్ కూడా ఉంది. కరోనా సమయంలో పేదల కోసం దాన్ని క్వారంటైన్ సెంటర్‌గా కూడా మార్చాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సినిమాలు వదిలేసి.. వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా: శ్రీకాంత్
కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్