Adani Group | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): దేశంలో గత కొన్ని వారాల నుంచి అదానీ గ్రూపు సంస్థల అక్రమాలు, వాటాపై హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడించిన చేదు నిజాలు, హంగేరియన్-అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపైనే చర్చ నడిచింది. ఇప్పుడు దీని స్థానంలో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశం, ఆ పార్టీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి అరెస్టుకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పలు కీలక అంశాలు మరుగున పడిపోయాయి. ఇదే సమయంలో మన విదేశీ మారకద్రవ్య నిల్వలు 11 వారాల కనిష్ఠ స్థాయికి దిగజారడాన్ని, అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమవడాన్ని, ఎగుమతులు క్షీణించడాన్ని ఎవరూ పెద్దగా గమనించలేదు. ఆ వివరాలు ఏమిటంటే..