Iran | టెహ్రాన్ : పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో ఆయుధాల విషయంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఏఐ సాంకేతికతతో కూడిన క్షిపణులను తాజాగా ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది. నైరుతి ఇరాన్‌లోని గల్ఫ్ జలాల్లో జరుగుతున్న డ్రిల్స్‌లో ఏఐ సాయంతో పనిచేసే ఆయుధాలను ఇరాన్ ఆర్మీ ప్రయోగించినట్టు ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. అడ్వాన్స్డ్ డ్రోన్ల సాయంతో క్షిపణులను ప్రయోగించినట్టు, అవి నిర్దేశిత లక్ష్యాలను చేధించినట్టు తెలిపింది.