సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్‌నేరగాళ్లు టోకరా వేశారు. నేరెడ్‌మెట్‌కు చెందిన బాధితుడి ఫోన్ నెంబర్‌ను ఎస్సీఎస్ఐ-855 టాపిక్ కన్సర్టెషన్ క్యాంప్ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.
ఎస్-హెచ్ఎన్డబ్ల్యూఐ యాప్‌ను గూగుల్‌ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేయాలని సూచనలు చేశారు. అలా బాధితుడితో పెట్టుబడులు పెట్టించి.. 19 లక్షలు దోచేశారు. కేసు దర్యాప్తులో ఉంది.