హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): తిరుపతిలలో తొకిసలాట ఘటనపై విచారణ అధికారి, రిటైర్డ్ జడ్జి, జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆదివారం తిరుపతిలో పర్యటించారు. తొలిరోజు ఈవో శ్యామలారావు, కలెక్టర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజా విచారణ ఎదుట హాజరై వివరాలు అందజేశారు. అనంతరం ఘటన జరిగిన పద్మావతి పారును రిటైర్డ్ జడ్జి సందర్శించారు.