నారాయణపేట, నవంబర్ 3 : జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు 12.4 కిలోల గంజాయి, రూ.10వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం ఇందుకు సంబందించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణ మండలంలోని కున్షీ గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఐదుగురు వ్య క్తులను పట్టుకొని పరిశీలించగా రెండు బైకులలో గంజాయి స రఫరా చేస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
వారిని విచారించి మరికొంత సమాచారం మేరకు కృష్ణ రైల్వే స్టేషన్ వద్ద మరో ఐదుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో సయ్యద్ అజార్ అలీ, మహ్మద్ సుఫియాన్ షా, కనిగిరి విశాల్ నారాయణపేటకు చెందిన వారు కాగా, ఉమేశ్, సోనియా, లల్లన్, సమీర్ సయ్యద్ యాదగిరికి చెందిన వారని, తుకారాం, సమీర్, అక్షయ్‌లు షోలాపూర్ ప్రాంతానికి చెందిన వారని తె లిపారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి గత రెండేళ్ల నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్, కర్ణాటకలోని యాద్గీర్ జిల్లాల నుంచి గంజాయి రవాణా చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
నిందితుల్లో ఒకడైన సుఫియాన్ షాకు గతంలో పేటలో నమోదైన కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు చెప్పారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి 12.4 కిలోల గంజాయి, 2 బైకులు, రూ. 10వేల నగదు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని న్యా యస్థానంలో హాజరు పరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. ఆపరేషన్ పాల్గొన్న డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై నవీద్, టాస్క్‌పోర్స్ ఎస్సై పురుషోత్తం, పోలీసులు గోప్యానాయక్, రాఘవేంద్రగౌడ్, రామస్వామి, అశోక్‌కుమార్, శ్రీకాంత్‌లను ఎస్పీ అభినందించారు. త్వరలో రివార్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.