రోడ్డు విస్తరణను అడ్డుకొని.. మొసలి కన్నీరా!
చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎందుకు విస్తరించలేకపోయారని నిలదీశారు.
- ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని నిలదీసిన స్థానికులు
- మంత్రులు, ఎమ్మెల్యేలకూ బాధిత కుటుంబాల నిరసన
- మర్రి చెట్లు కొట్టేయొద్దని ఎన్జీటీలో కేసు, కొండా మద్దతు
- బీఆర్ఎస్ వల్లే ఆలస్యమైందన్న కొండాపై బాధితుల మండిపాటు
- విశ్వేశ్వర్‌రెడ్డి పాత ట్వీట్లు పోస్ట్ చేసి, ఆడుకుంటున్న నెటిజన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎందుకు విస్తరించలేకపోయారని నిలదీశారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యా రు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఎంపీగా ఉన్నారు కదా అని నిలదీశారు. కేసీఆర్ ప్రభు త్వం రెండో టర్మ్‌లో రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులు కేటాయిస్తే.. మర్రిచెట్లు కొట్టేయవద్దంటూ ఉద్యమించి, విస్తరణను అడ్డుకున్నది మీరే కదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం ఎందుకు నెడుతున్నారని నిలదీశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, విశ్వేశ్వర్‌రెడ్డి నీళ్లు నమిలారు. వాస్తవంగా 2022లోనే రోడ్డు విస్తరణకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిధులు కూడా కేటాయించింది. కానీ కేసీఆర్ ప్రభుత్వ ప్రణాళికలకు వ్య తిరేకంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఆనాడు రోడ్డు విస్తరణను అడ్డుకుని, ప్రభుత్వ చర్యలకు అడ్డంపడి, ఇప్పుడు ప్రమాదంపై మొసలి కన్నీరు కార్చడమేంటని విశ్వేశ్వర్‌రెడ్డిని నెటిజన్లు నిలదీస్తున్నారు. గతంలో కొండా చేసిన ట్వీట్లను గుర్తుచేస్తూ.. వాటిని పోస్ట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

