హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే చర్యలపై యాజమాన్యం మరింత ఫోకస్ పెట్టింది. ఆర్టీసీలో విభాగాల వారీగా ఆదాయం, ఖర్చులను గంపగుత్తుగా చూడకుండా ఎక్కడ ఎక్కువ ఖర్చు ఉంటున్నది. ఏయే మార్గాల్లో సంస్థకు ఆదాయం వస్తున్నది స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అంతర్గత బడ్జెట్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం విభాగాలవారీగా బ్యాలెన్స్ షీట్లను రూపొందించాలన్న యోచనలో ఉన్నారు. దీనిద్వారా నిర్వహణ వ్యయం లోటుపాట్లను సరిదిద్దే దిశగా మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈ విధానాన్ని ఈ నెల నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలుస్తున్నది.