గౌతంనగర్, నవంబర్12: మౌలాలి డివిజన్ ఎస్పీనగర్లో చేపట్టిన డ్రైనేజీ పనులను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అమీనోద్దిన్, ఎం.భాగ్యనందరావు, డివిజన్ అధ్యక్షుడు సంతోష్నాయుడు, ఉపాధ్యక్షుడు బుద్ధి నర్సింగ్‌రావు, ప్రచార కార్యదర్శి మహేశ్‌గౌడ్, ఇబ్రహీం, గౌలికర్ దినేశ్ తదితరులు ఉన్నారు.