School Collapse | ఇండోనేసియా (Indonesia)లో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది (School Collapse). ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందగా.. 65 మంది శిథిలాల కింద (rubbles)చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. జావాలోని సిడోర్జో పట్టణంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
పట్టణంలో ఇస్లామిక్ పాఠశాల భవనం నిర్మాణం చేపడుతున్నారు. అయితే, సోమవారం మధ్యాహ్నం సమయంలో అందులోని విద్యార్థులు ప్రార్థనల కోసం గుమిగూడారు. ఆ సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. దాదాపు 70 మందిని స్థానికులు రక్షించారు. సుమారు 65 మంది దాకా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. విద్యార్థులంతా 12 నుంచి 17 ఏండ్ల వయసు గలవారే అని స్థానిక మీడియా నివేదించింది. విషయం తెలియగానే విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
Also Read..
Donald Trump | ట్రంప్ మరో టారిఫ్ బాంబ్.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత
PM Modi | పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతికి మార్గం.. గాజాపై ట్రంప్ ఫార్ములాను స్వాగతించిన భారత్
Donald Trump | యుద్ధం ముగింపుకు కీలక ముందడుగు.. గాజాపై ట్రంప్ ప్రణాళికను అంగీకరించిన ఇజ్రాయెల్