Mammootty | గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఎట్టకేలకు కోలుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పేట్రియాట్’ (Patriot) దర్శకుడు మహేశ్ నారాయణన్ (Mahesh Narayanan) తాజాగా వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి హైదరాబాద్‌లో జరుగునున్న షూటింగ్లో మమ్ముట్టి సెట్స్‌లోకి రానున్నారని ఆయన తిరిగి కోలుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని దర్శకుడు తెలిపారు. మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మమ్ముట్టితో పాటు మోహన్‌లాల్, ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబన్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యాక మమ్ముట్టి ఆరోగ్య సమస్య కారణంగా కొంత విరామం తీసుకున్నారు. ఈ విరామ సమయంలో కూడా ఆయన సినిమా గురించే ఆలోచించేవారని తాను ప్రతిరోజూ షూటింగ్ అప్డేట్ ఇచ్చేవాడినని దర్శకుడు చెప్పారు. మమ్ముట్టి గారు లోకేషన్లో లేకపోయినప్పటికీ, ఆయన పర్యవేక్షణ షూటింగ్లో పాల్గొన్నంతగా ఉండేదని అందుకే ఇన్ని నెలల విరామం తీసుకున్నప్పటికీ సినిమా షూటింగ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో మమ్ముట్టి అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Good News! @mammukka after his recent illness will be back in front of the camera! #Mammootty will join the Mahesh Narayanan multi- starrer #Patriot in Hyderabad from Oct 1st. pic.twitter.com/TWM4t2LwtO
— Sreedhar Pillai (@sri50) September 29, 2025