రాయ్‌పూర్: చత్తీస్‌ఘడ్‌లో దారుణమైన మర్డర్(Chhattisgarh Murder) జరిగింది. గర్భం దాల్చిన ఓ మైనర్ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను కత్తితో గొంతుకోసి చంపేసింది. ఈ ఘటన రాయ్‌పూర్‌లోని ఏవన్ లాడ్జీలో జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బిలాస్‌పూర్‌కు చెందిన 16 ఏళ్ల నిందితులు సెప్టెంబర్ 28వ తేదీన తన బాయ్‌ఫ్రెండ్ మొహమ్మద్ సద్దాంను కలిసేందుకు రాయ్‌పూర్ వెళ్లింది. బీహార్‌కు చెందిన ఎంఎస్ ఇంజినీరింగ్ ఆఫీసర్ అయిన బాధిత వ్యక్తితో కలిసి లాడ్జీలో గడిపింది. ప్రెగ్నెంట్ అయిన ఆ మైనర్‌పై బాధిత వ్యక్తి వత్తిడి తెచ్చాడు. అబార్షన్ చేయించుకోవాలని ఆమెపై ప్రెజర్ పెట్టాడు. దీంతో లాడ్జీ బయట ఇద్దరి మధ్య ఆ రోజు గొడవ జరిగింది. కత్తితో చంపేస్తానని బెదిరించాడతను.
అయితే ఆ రోజు రాత్రి లాడ్జీ రూమ్‌లో సద్దాం నిద్రిస్తున్న సమయంలో.. అతడు బెదిరించిన కత్తితోనే అతని గొంతు కోసేసిందామె. ఆ తర్వాత రూమ్‌ను బయటి నుంచి లాక్ చేసి సద్దాం మొబైల్ ఫోన్‌తో పరారీ అయ్యింది. లాడ్జీ రూమ్ తాళంచెవులను .. సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ వద్ద పడేసింది. మరుసటి రోజు బిలాస్పూర్లో స్వంత ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన నేరం గురించి ఆ మైనర్ తన తల్లికి చెప్పింది. కోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిందితురాలి తల్లి మర్డర్ గురించి ఫిర్యాదు చేసింది. ఏవన్ లాడ్జీకి వెళ్లిన రాయ్‌పూర్ పోలీసులు.. అక్కడ నిర్జీవంగా పడి ఉన్న సద్దాం మృతదేహాన్ని వెలికితీశారు.
బీహార్‌లో ఉన్న సద్దాం ఫ్యామిలీతో కాంటాక్టు అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధిత వ్యక్తికి చెందిన ఫోన్ తమ వద్ద ఉన్నట్లు చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అమ్మాయి మూడు నెలల గర్భిణి అని తెలిసింది. అబార్షన్ చేయించుకోవాలన్న ఇష్టం లేదని ఆ అమ్మాయి పేర్కొన్నది. పెళ్లి చేసుకోవాలని లేదని, గర్భస్త్రావం చేయించుకోవాలని సద్దాం వత్తిడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ అంశంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు ఆమె బాయ్‌ప్రెండ్ ప్రాణాలు తీసింది.