Pakistan | అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారి రిచర్డ్ బార్లో (Richard Barlow) సంచలన వ్యాఖ్యలు చేశారు. దాయాది పాకిస్థాన్ (Pakistan) అణు ఆశయాన్ని అడ్డుకునేందుకు భారత్-ఇజ్రాయెల్ కలిసి చేసిన రహస్య ప్రణాళికను అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) తిరస్కరించినట్లు చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఈ ఆపరేషన్‌ను తిరస్కరించడాన్ని ఆయన సిగ్గు చేటుగా అభివర్ణించారు.
పాక్‌లోని కహూతా అణుకేంద్రాన్ని (Kahuta nuclear facility) బాంబులతో ధ్వంసం చేసేందుకు రూపొందించిన ఈ ఆపరేషన్‌కు ఇందిర ఆమోదం తెలిపి ఉంటే ప్రపంచానికి ఎన్నో సమస్యలు తప్పి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. 1980లో పాక్ రహస్య అణు కార్యకలాపాలను అభివృద్ధి చేస్తున్న సమయంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో బార్లో పనిచేశారు. అయితే, ఆసమయంలో ఈ ప్రణాళిక గురించి తాను విన్నట్లు ఓ ఇంటర్వ్యూలో బార్లో తెలిపారు. ‘ఆసమయంలో నేను ప్రభుత్వ సర్వీసులో లేను. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఈ ఆపరేషన్ గురించి విన్నాను. అది కార్యరూపం దాల్చలేదు. ఇందిరా గాంధీ ఈ ప్రణాళికను అడ్డుకున్నారు. అలా చేయడం సిగ్గుచేటు. ఆ ఆపరేషన్‌ను ఆమోదించి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి’ అని ఆయన వివరించారు.
నివేదికల ప్రకారం.. పాక్‌లోని కహూతా అణుకేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్, భారత్ ప్లాన్ చేశాయి. అణ్వాయుధాలను పాక్ అభివృద్ధి చేయకుండా, వాటిని ఇతర దేశాలకు అందించకుండా నిరోధించేందుకు దాడి చేయాలని ప్రణాళిక రచించాయి. అయితే, ఈ రహస్య ఆపరేషన్‌ను అప్పటి భారత ప్రభుత్వం అడ్డుకుంది. అణు కార్యక్రమ రూపశిల్పి ఏక్యూ ఖాన్ నేతృత్వంలో అభివృద్ధి చెందిన కహూతా కేంద్రం.. చివరికి పాకిస్థాన్‌ను అణ్వస్త్ర దేశంగా మార్చింది. 1998లో పాకిస్థాన్ తొలి అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
Also Read..
Air India | సాంకేతిక సమస్య.. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఆరు గంటలు ఆలస్యం
Air Pollution | ఢిల్లీలో అధ్వానస్థితిలో వాయు కాలుష్యం.. శ్వాస తీసుకోవడంలో ప్రజల ఇబ్బందులు
Mali | మాలిలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్