ముంబై, జనవరి 3 : విదేశీ నిల్వలు క్రమంగా కరిగిపోతున్నాయి. గత నెల చివరినాటికి భారత్లో విదేశీ మారకం నిల్వలు 4.112 బిలియన్ డాలర్లు తరిగిపోయి 640.279 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 8.478 బిలియన్ డాలర్లు తగ్గి 644.391 బిలియన్ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ రూపంలోవున్న ఆస్తుల విలువ 4.641 బిలియన్ డాలర్లు తగ్గి 551.921 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కానీ, పసిడి రిజర్వులు మాత్రం 541 మిలియన్ డాలర్లు ఎగబాకి 66.268 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.