న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కొవిడ్-19తో అది మరింత దిగజారిందని రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దీంతో ఎంతోమంది మధ్యతరగతి ప్రజలు పేదరికంలో కూరుకుపోయారన్నారు. నల్సార్ లా వర్సిటీ వర్చువల్‌గా నిర్వహించిన ఒక సదస్సులో రాజన్ మాట్లాడుతూ స్టాక్ మార్కెట్ ర్యాలీ..ఎంతోమంది భారతీయులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్న వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదన్నారు. ఆర్థిక పథకాలేవైనా ఉపాధి కల్పించేవిగా ఉండాలని, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో ఇండియా చేరాల్సిన అవసరం ఉందన్నారు.