Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా (0.9 శాతం) లాభాల బాటపట్టగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా (0.12 శాతం) నష్టపోయింది. అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇలా మిశ్రమ ఫలితాలొచ్చాయి. ఉదయం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్ 73,988.27 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. ఒక దశలో 74,613.01 కి చేరింది. ఇంట్రాడేలో 400 పాయింట్ల లాభాలు పొందింది.
చివరికి 64 పాయింట్ల లాభంతో 73,983.18 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,425.35 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 27.15 పాయింట్లు నష్టపోయి 23,214.95 పాయింట్ల వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా రాజకీయ పరిస్తితులు మారడం వంటివి మొదట సానుకూల ఫలితాలకు కారణమయ్యాయి. చివరకు అమ్మకాల ఒత్తిడి కారణంగా స్వల్ప లాభాలతో సెన్సెక్స్ ముగిసింది. మరోవైపు భారత రూపాయి బుధవారం స్వల్పంగా లాభపడింది. 0.1 శాతం లాభపడి డాలర్‌తో రూపాయి విలువ 95.265 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర స్వల్పంగా (0.24 శాతం) తగ్గి, 88.10 డాలర్ల వద్ద ముగిసింది.
అలాగే, బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.24 శాతం తగ్గి, 91.23 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ఔన్స్ ధర 4167 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో హిందుస్తాన్ యునీలీవర్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, టైటాన్ షేర్లు లాభాలు పొందాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు ఎక్కువగా లాభాలు చవిచూశాయి. మారుతి, అదానీ స్పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఇండిగో, బజాజ్ ఫినాన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.