Oman Coast | భారత జెండాతో ఉన్న నౌక ఒమన్ తీరంలో మునక.. సిబ్బంది సురక్షితం..!
Oman Coast | ఒమన్ తీరం (Oman Coast) లో భారత జెండా (Indian flag) తో ప్రయాణిస్తున్న ఓ నౌక నీటమునిగింది. యాంత్రిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ముంబై (Mumbai) కి వెళ్తున్న మరో నౌకలో వారిని ఎక్కించినట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Oman Coast : ఒమన్ తీరం (Oman Coast) లో భారత జెండా (Indian flag) తో ప్రయాణిస్తున్న ఓ నౌక నీటమునిగింది. యాంత్రిక లోపం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. అందులోని 14 మంది భారతీయ సిబ్బందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. వారంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ముంబై (Mumbai) కి వెళ్తున్న మరో నౌకలో వారిని ఎక్కించినట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. భారత జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంఎస్వీ విరాట్ 1’ నౌకకు సంబంధించిన సహాయక చర్యలు విజయవంతంగా పూర్తయ్యాయి.
మొత్తం 14 మంది సిబ్బందిని రక్షించామని, వీరంతా ప్రస్తుతం ‘జబల్ అలీ 9’ నౌకలో ముంబైకి బయలుదేరారని భారత ఎంబసీ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. అంతకుముందు ఒమన్ తీరంలో ఓ నౌక నిలిచిపోయిందని, ఇంజిన్ వైఫల్యమే దీనికి కారణమని పేర్కొన్నది. నౌకలోని సిబ్బంది లైఫ్ రాఫ్ట్లోకి మారారని, ఒమన్ అధికారుల సమన్వయంతో సమీపంలోని నౌకల ద్వారా వారి తరలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఒమన్ తీర ప్రాంతానికి సమీపంలో ఓ చమురు ట్యాంకర్లో విధులు నిర్వహిస్తున్న భారతీయ నావికుడు నిశాంత్ ఉర్తనాథన్ అనారోగ్య కారణాలతో మృతి చెందిన ఘటనపైనా రాయబార కార్యాలయం స్పందించింది.
నిశాంత్ కుటుంబసభ్యులు, ఆ నౌక సిబ్బంది సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆయన భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా నౌక నుంచి దించి స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నది. ఇటీవల ఒమన్ తీరం సమీపంలో భారతీయులు ఉన్న నౌకలపై వరుసగా దాడులు జరిగాయి. వారం వ్యవధిలో మూడు నౌకలను అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. భారత్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తక్షణమే ఈ చర్యలను ఆపేయాలంటూ అమెరికాపై నిరసన వ్యక్తం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

