న్యూఢిల్లీ: యూరప్‌లో అతి ప్రాచీన స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్లు నీతు (48 కిలోలు), అనామిక (50 కి) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. బల్గేరియా వేదికగా సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో నీతు 5-0తో చుమ్గల్కోవా లులియా (రష్యా)పై నెగ్గి ముందంజ వేయగా.. అనామిక 4-1తో చుకనోవా జ్లాటిస్లావాను చిత్తు చేసింది. తదుపరి పోరులో రొబెర్ట బొనాట్టి (ఇటలీ)తో నీతూ, రౌమేసా బౌలెమ్ (అల్గేరియా)తో అనామిక తలపడనుంది.