న్యూఢిల్లీ, మార్చి 31: ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్..రెపో రేట్లతో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రుణాలపై వడ్డీరేటు 9.05 శాతానికి చేరుకున్నది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రిటైల్, గృహ, ఇతర రుణాలు మరింత భారంకాబోతున్నాయి. పెరిగిన వడ్డీరేటు గురువారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
రెనో చేతికి నిస్సాన్ వాటా
న్యూఢిల్లీ, మార్చి 31: భారతీయ తయారీ జాయింట్ వెంచర్ రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎన్ఏఐపీఎల్)లో నిస్సాన్కున్న 51 శాతం వాటాను కొనేస్తున్నట్టు సోమవారం రెనాల్ట్ (రెనో) ప్రకటించింది. అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగానే ఇది జరుగబోతున్నది. అయితే ఎంతకు కొంటున్నదన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ జాయింట్ వెంచర్లో చెన్నై ప్లాంట్ నడుస్తుండగా, ఇక్కడ రెనాల్ట్, నిస్సాన్ కార్లు తయారవుతున్నాయి.