స్కోప్జె(మెసడోనియా): డబ్ల్యూటీటీ యూత్ స్టార్ కంటెండర్ టోర్నీలో భారత యువ ద్వయం అనన్య మురళీధరన్, దివ్యాంశి భౌమిక్ పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన బాలికల అండర్-15 డబుల్స్ ఫైనల్లో అనన్య, దివ్యాంశి జోడీ 11-8, 7-11, 11-8, 6-11, 14-12తో చైనా జంట జావో వాంగ్వి, లియు జిలింగ్పై అద్భుత విజయం సాధించింది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో అనన్య, దివ్యాంశి..చైనా ప్యాడర్లకు దీటైన పోటీనిచ్చారు. తొలి గేమ్‌ను 11-8తో దక్కించుకుని ఆధిక్యం ప్రదర్శించిన భారత జోడీకి రెండో గేమ్‌లో చుక్కెదురైంది. అయితే మూడో గేమ్ భారత్ వశం కాగా, నాలుగో గేమ్ చైనా ఖాతాలో చేరింది. దీంతో నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో తుదికంటా పోరాడిన అనన్య, దివ్యాంశి మ్యాచ్‌ను కైవసం చేసుకుని పసిడి పతకాన్ని ముద్దాడారు.