బోడుప్పల్ : మూడు నెలలుగా జీతాలు ( Salary ) లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బోడుప్పల్ గురుకుల నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు ( Non-teaching teachers ) సోమవారం గురుకుల పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యంతో పాటు ప్రతి నెల జీతాలు అందేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ లేక జీతాలు సకాలంలో ఇవ్వలేకపోతున్నామని కుంటిసాకులు చెబుతుందని ఆరోపించారు.
జీతాలు అందక కుటుంబం గడువలేని పరిస్ధితి నెలకొందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దారుణ పరిస్ధితి ఉందని తెలిపారు. బోడుప్పల్ గురుకుల పాఠశాలలో 15మంది టీచింగ్, నాన్‌టీచింగ్ ఉపాధ్యాయులు అప్పులు చేసుకుని జీవితాలు కొనసాగిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, వెంకన్న, కోటేశ్వరచారి, డిప్యూటీ వార్డెన్ షభానబేగం తదితరులు పాల్గొన్నారు.