మద్దూర్ : బాధితుడు నుంచి లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ (Revenue Inspector) ను మహాబూబ్‌నగర్ ఏసీబీ ( ACB ) అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ తహసీల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అమర్నాథ్ రెడ్డి ( Amarnath Reddy) సోమవారం కార్యాలయంలో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు .
మండలంలోని రేనిమిట్ట గ్రామానికి చెందిన బాధితుడు తన తండ్రి పేరిట ఉన్న భూమి వెరిఫికేషన్ చేసి పట్టదారు పుస్తకం ఇవ్వాలని కోరాడు. దీంతో ఆర్ఐ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వ్యూహం ప్రకారం కార్యాలయంలో పట్టుకుని కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.