ఢిల్లీ: వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జరిగిన ఏజీఎంలో వెల్లడించింది. 11 దేశాలు ఆడబోయే ఈ టోర్నీలో ఆతిథ్య హక్కులు గతేడాదే భారత్కు దక్కాయి. కాగా ఈ టోర్నీలో పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు రాకుంటే ఆ దేశం ఆడే మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో (శ్రీలంక లేదా నేపాల్లో) నిర్వహించే అవకాశమున్నట్టు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) అధ్యక్షుడు జీకే మహంతేష్ తెలిపారు. కాగా పాకిస్థాన్లో మంగళవారం ముగిసిన పురుషుల అంధుల టీ20 ప్రపంచకప్-2024ను పాకిస్థాన్ గెలుచుకుంది. ఈ టోర్నీ ఆడేందుకు కేంద్ర ప్రభుత్వం భారత ఆటగాళ్లకు వీసాలు నిరాకరించిన విషయం తెలిసిందే.