దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) సెమీఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. బ్యాటర్లు స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీలు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఆ ఇద్దరూ భారత స్పిన్నర్లను మెరుగ్గా ఎదుర్కొన్నారు. స్లో బౌలర్లకు అనుకూలిస్తున్న దుబాయ్ పిచ్‌పై.. స్మిత్, క్యారీలు ఓపికగా ఆడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఆరంభంలో జలక్ తగిలింది. ఓపెనర్ కూపర్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ .. కొన్ని షాట్లతో అలరించాడు. షమీ వేసిన ఓ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టాడు. 39 రన్స్ చేసి ట్రావిస్ నిష్క్రమించాడు.
అయితే క్రమంగా వికెట్లు కోల్పోతున్నా.. స్టీవ్ స్మిత్ మాత్రం సమర్థవంతంగా భారత స్పిన్నర్లను ఆడాడు. స్మిత్ 73 రన్స్ చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. అలెక్స్ క్యారీ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతను మరో హాఫ్ సెంచరీ బాదాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో స్కోరు బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశాడు. కానీ శ్రేయాస్ అయ్యర్ డైరెక్ట్ త్రో వల్ల అతను రనౌట్ అయ్యాడు.
భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్లు కూడా రాణించారు. వరుణ్, జడేజాలు చెరి రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక అక్షర్, హార్దిక్ ఖాతాలో ఒక వికెట్ పడింది. దుబాయ్ పిచ్ స్లో ఉన్న కారణంగా.. ఆస్ట్రేలియా విసిరిన టార్గెట్ చాలా రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నారు. భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నా.. స్పిన్నర్లను ఎదుర్కొనే తీరును బట్టి ఫైనల్ ఆశలు నిలుస్తాయి.
Innings Break!
A fine bowling performance from #TeamIndia as Australia are all out for 2⃣6⃣4⃣
Over to our batters 🙌
Scorecard ▶️ https://t.co/HYAJl7biEo#INDvAUS | #ChampionsTrophy pic.twitter.com/79GlEOnuB1
— BCCI (@BCCI) March 4, 2025