Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
Priyanka Gandhi | ఢిల్లీ (Delhi) లో నిరసన తెలిపేందుకు వచ్చిన యువతను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi) తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే నిరసనలను అడ్డుకుంటున్నారని విమర్శించారు.
Priyanka Gandhi : ఢిల్లీ (Delhi) లో నిరసన తెలిపేందుకు వచ్చిన యువతను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi) తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే నిరసనలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నవారు దేశద్రోహానికి పాల్పడుతున్నట్లేనని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఎస్ఐఆర్ వ్యతిరేక నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా నిరసన తెలుపుతున్నారంటూ ఎక్కడికక్కడే యువతను అదుపులోకి తీసుకోవడంపై ప్రియాంకా గాంధీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు. గతంలో 254 మంది ఎంపీలను ఇబ్బందులకు గురిచేసి, అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నిరసనకారులపైనా అదేవిధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీని దిగ్బంధించి, రైళ్లు, మెట్రో సేవలను అడ్డుకుని, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, అడుగడుగునా తనిఖీలు చేపడుతున్నారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును వినియోగించుకుంటున్న యువతపై దాడులుచేసి అదుపులోకి తీసుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘం సహకారంతో ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో నియంతృత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ కూడా ఈ ఘటనలపై స్పందించారు. ఢిల్లీని కోటలా మార్చేశారని, శాంతియుతంగా నిరసన తెలిపే యువతను చూసి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అన్నారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం కల్పించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

