Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Oppo F35 : చైనాకు చెందిన ఒప్పో బ్రాండ్ నుంచి ఎఫ్ సిరీస్‌లో తాజాగా రెండు ఫోన్లను సంస్థ ఇండియాలో విడుదల చేసింది. ఎఫ్35, ఎఫ్35 ప్రో పేరుతో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Oppo F35 : చైనాకు చెందిన ఒప్పో బ్రాండ్ నుంచి ఎఫ్ సిరీస్‌లో తాజాగా రెండు ఫోన్లను సంస్థ ఇండియాలో విడుదల చేసింది. ఎఫ్35, ఎఫ్35 ప్రో పేరుతో రెండు 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియం రేంజ్ బడ్జెట్లో మంచి కెమెరా, బ్యాటరీ కోరుకునే వారికి ఇవి మంచి ఆప్షన్.
ఈ ఫోన్లు అక్టోబర్ 11 నుంచి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఒప్పో స్టోర్లలో కూడా ఫోన్లు అందుబాటులో ఉంటాయి. వివిధ కార్డులపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తిస్తాయి. ఈ ఫోన్లలోని కీలక ఫీచర్లివి.
ఒప్పో ఎఫ్35 5జీ
6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 1,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ ఎస్ఓసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఒప్పో కలర్ ఓఎస్ 16.5, ఐపీ66+ఐపీ68+ఐపీ69కే రేటింగ్, 50ఎంపీ మెయిన్ కెమెరా+2ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వంటి ఫీచర్లున్నాయి. మిస్ట్ పింక్, టైటానియం గ్రే, వేవ్ బ్లూ కలర్స్‌లో లభ్యం. ధరలు సుమారు రూ.38,999, రూ.42,999.
ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ
6.78 అంగుళాల 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 144 రిఫ్రెష్‌రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 బేస్డ్ ఒప్పో కలర్ ఓఎస్ 16.5, 50ఎంపీ మెయిన్ కెమెరా+8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వంటి ఫీచర్లున్నాయి. సన్‌సెట్ ఆరెంజ్, ట్వైలైట్ బ్రౌన్, వేవ్ బ్లూ కలర్స్‌లో లభ్యం. ధరలు సుమారు రూ.45,999, రూ.49,999, రూ.54,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

