Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
Sonam Wangchuk | దేశ రాజధాని ఢిల్లీలో నిర్బంధించిన రాజకీయ నాయకులను ఆదివారం లోగా విడుదల చేయాలని వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేస్తానని ఆయన హెచ్చరించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్బంధించిన రాజకీయ నాయకులను ఆదివారం లోగా విడుదల చేయాలని వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేస్తానని ఆయన హెచ్చరించారు. (Sonam Wangchuk) ఓటర్ల జాబితా అవకతవకల ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనకు మద్దతు తెలిపిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖ వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నీట్ లీక్ వ్యవహారంపై గత సీజేపీ నిరసనల సందర్భంగా చాలా రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆ ఆందోళనకు ఊపు తెచ్చిన లఢక్ ఉద్యమకారుడు, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తాజాగా దీనిపై స్పందించారు. దేశంలోని పరిస్థితిని ‘అప్రకటిత అత్యవసర పరిస్థితి’గా ఆయన అభివర్ణించారు. నిరసన ప్రదర్శన సమయంలో ఐక్యత, శాంతిని పాటించాలని తాను ఇంతకుముందే విజ్ఞప్తి చేశానని తెలిపారు.
అయితే పరిస్థితి ఇంతలా ముదిరి పలువురు నాయకుల అరెస్టుకు దారితీస్తుందని తాను ఊహించలేదని ఎక్స్ పోస్ట్‌లో వాంగ్‌చుక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘రేపటి (ఆదివారం) లోగా వారిని విడుదల చేయకపోతే, ఆమరణ నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేపట్టే విషయాన్ని నేను పరిశీలించాల్సి వస్తుంది’ అని వీడియో సందేశంలో పేర్కొన్నారు.
అలాగే వివిధ వర్గాల నాయకులు ఐక్యంగా ఉండాలని, యువ నిరసనకారులు ఏ పరిస్థితుల్లోనైనా శాంతిని పాటించాలని సోనమ్ వాంగ్‌చుక్ కోరారు. ఎత్తైన హిమాలయ ప్రాంతంలో రాబోయే శీతాకాలం కోసం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటం వల్ల, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన తాజా నిరసన సమావేశానికి తాను హాజరుకాలేనని ముందుగానే ఆయన ప్రకటించారు.
INDIA IN A STATE OF UNDECLARED EMERGENCY…
Yesterday when I posted a message appealing for unity & peace in today’s protest I had never imagined that the biggest democracy in the world would be under an undeclared EMERGENCY.
I was happy there were so many leaders to lead the movement, but I now learn that they have all been arrested. I hope those arrested will be released soon. I will be compelled to consider an Anshan Fast or Padyatra March if they are not released by tomorrow.
#JantarMantar #protest #CJP #CEC #sonamwangchuk— Sonam Wangchuk (@Wangchuk66) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

