SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
SA vs AUS : డర్బన్ టెస్టులో అద్భుత శతకంతో ఆస్ట్రేలియాను ఆదుకున్న మ్యాట్ రెన్షా(190) డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అసమాన పోరాటంతో భారీ స్కోరందించిన అతడు.. టీ బ్రేక్ తర్వాత చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
SA vs AUS : డర్బన్ టెస్టులో అద్భుత శతకంతో ఆస్ట్రేలియాను ఆదుకున్న మ్యాట్ రెన్షా(190) డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. తొలిరోజే దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 84 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్‌కు అసమాన పోరాటంతో భారీ స్కోరందించిన అతడు.. టీ బ్రేక్ తర్వాత చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రధాన బ్యాటర్లు తడబడిన చోట సఫారీ పేస్ దళాన్ని దీటుగా ఎదుర్కొన్న రెన్షాకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్(43), టెయిలెండర్ల నుంచి చక్కని సహకారం లభించింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ నాలుగొందలుకు పది పరుగుల దూరంలో ఆగిపోయింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు డర్బన్‌లో తడబడి నిలబడిన ఆస్ట్రేలియా రెండో రోజు గొప్పగా పుంజుకుంది. ఆలౌట్ ప్రమాదంలో పడిన ఆసీస్ మ్యాట్ రెన్షా(190)తో తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధిచింది. మూడేళ్ల తర్వాత పునరాగమనంలో బంగ్లాదేశ్‌పై విఫలమైన అతడు సఫారీ బౌలర్లను కాచుకొన్న తీరు అమోఘం. వియాన్ మల్డర్(4-68), నోర్జి, యాన్సెన్ బుల్లెట్ బంతులను ఎదుర్కొన్న అతడు సారథి ప్యాట్ కమిన్స్(43)తో విలువైన భాగస్వామ్యం నిర్మించాడు.
Matt Renshaw’s second Test hundred – 9 years after his first – is his career best
What a story after being out of the Test side for three years 👏 https://t.co/Yt4XZAznFg
— Cricinfo (@cricinfo) October 10, 2026
క్రీజులో పాతుకుపోయి
ఓవర్‌నైట్ స్కోర్187/6తో రెండో రోజు ఆట మొదలెట్టిన కంగారూ జట్టుకు భారీ స్కోరందించే బాధ్యత తీసుకున్న రెన్షా టెయిలెండర్లతో కీలక పరుగులు సాధించాడు. అనుభవజ్ఞులైన ట్రావిస్ హెడ్(9), లబూషేన్(37), స్టీవెన్ స్మిత్(25), అలెక్స్ క్యారీ(14)లు విఫలమైనా.. జట్టుపై తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రీజులో పాతుకుపోయిన రెన్షా సఫారీల వ్యూహాలను తిప్పికొట్టాడు. ఐదో వికెట్‌కు 86 రన్స్ జోడించిన ఈ ద్వయాన్ని మల్డర్ విడదీశాడు. కమిన్స్ ఔటైనా ఓపికగా ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సుదీర్ఘ ఫార్మాట్లో తొమ్మిదేళ్ల తర్వాత మూడంకెల స్కోరందుకున్నాడు.
South Africa have no answer to Matt Renshaw
An epic knock 🙌 https://t.co/JlJF2Ju3ie
— Cricinfo (@cricinfo) October 10, 2026
‘సెంచరీ కొట్టాను కదా’ అని వికెట్ ఇవ్వకుండా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన ఆ వందను 150గా మలిచాడు. ఆతిథ్య జట్టు బౌలర్లను విసిగించిన అతడి కారణంగా భోజన విరామం సమయానికి పర్యాటక జట్టు 8 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ ఔటయ్యాక 92 బంతులు ఎదుర్కొన్న సీనియర్ ఆటగాడు నాథన్ లియన్(27)ను యాన్సెన్ బౌల్డ్ చేయడంతో తెంబా బవుమా సేన ఊపిరి పీల్చుకుంది. చివరి బ్యాటరైన హేజిల్‌వుడ్ సాయంతో టీ సమయానికి 390 /9తో టీ విరామానికి వెళ్లిన ఆసీస్ బ్రేక్ తర్వాతి ఓవర్లోనే ఆలౌటైంది. కెరీర్లో తొలి ద్విశతకానికి చేరువైన రెన్షా ఆడిన బంతిని మర్క్రమ్ అందుకోగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

