దిగ్గజ కార్పొరేట్ సంస్థల్లో తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలి. అందుకోసం నా సర్వశక్తులూ ఉపయోగిస్త. పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ కొత్త చిరునామాగా మారింది.
– కేటీఆర్
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : తాము అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ అభిమతమని, ఇండియా ఫస్ట్, తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ విధానమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలని, అందుకోసం తన సర్వశక్తులూ ఉపయోగిస్తానని పునరుద్ఘాటించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ శనివారం ఇంగ్లండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ప్రాగ్మటిక్ డిజైన్ సొల్యుషన్స్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విజయాల గురించి మాట్లాడటం ఎల్లప్పుడూ తనకు గర్వకారణంగా ఉంటుందని చెప్పారు. ఆటోమొబైల్ రంగంలో పీడీఎస్ఎల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించాలని కోరారు. ఇంగ్లండ్‌లో వర్సిటీ, ఇండస్ట్రీల మధ్య ఉన్న పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. మెక్ లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలను అందించే పీడీఎస్ఎల్ సంస్థ.. వార్విక్ వర్సిటీలో తన నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించుకోవడం తెలంగాణ టాలెంట్‌కు నిదర్శనమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే ఆటోమోటివ్ హబ్‌గా పుణె, చెన్నైల సరసన హైదరాబాద్ నిలిచిందని గుర్తుచేశారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్‌తోపాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందని తెలిపారు. ఆటోమోటివ్ రంగంలో కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కే పరిమితం కాకుండా తయారీ రంగంలోనూ తెలంగాణను నంబర్‌వన్‌గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తెచ్చిన పాలసీలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.
భారతదేశంలో ఫార్ములా ఈ-రేసింగ్ చాంపియన్ షిప్‌ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు తెలంగాణ కొత్త చిరునామాగా మారిందని తెలిపారు. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో గడిచిన పదేండ్లలో ప్రారంభించాయని గుర్తుచేశారు. తమ తొమ్మిదేండ్ల పాలనలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతోపాటు ఇతర రంగాల్లోనూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందని చెప్పారు.
వినూత్న ఆలోచనలు, పనితీరుతో కేటీఆర్ తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా గ్లోబల్ లీడర్‌గా ఎదిగారని పీడీఎస్ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల చెప్పారు. కేటీఆర్ చేసిన పనులు, తీసుకొచ్చిన విధానాలు ముఖ్యంగా ఇన్నోవేషన్ రంగానికి చేసిన కృషితో ఐటీ ఒకటే కాకుండా అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు. అనేక దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి తన పనితీరు, ఆలోచనా దృక్పథంతో గ్లోబల్ లీడర్‌గా ఎదిగిన కేటీఆర్ చేతుల మీదుగా తమ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించుకోవడం కంపెనీకి అత్యంత గర్వకారణమని చెప్పారు. నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం అకడ కార్యకలాపాలను కేటీఆర్ పరిశీలించారు. తమ సంస్థ గురించి పీడీఎస్ఎల్ ప్రతినిధులు ఆయనకు వివరించారు. ఆ తరువాత కంపెనీ సిబ్బంది, ఉద్యోగులతో కేటీఆర్ ఇంటరాక్ట్ అయ్యారు.
ఐటీ, అనుబంధ రంగాలు, ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లో మన దేశ యువత ప్రతిభ, నిబద్ధతతో అద్భుతంగా రాణిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత, విద్యార్థులు, కంపెనీలు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి.
-కేటీఆర్
దేవరుప్పుల, మే 31: బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లయిన సందర్భంగా జూన్ 1న అమెరికాలోని డాలస్‌లో బీఆర్ఎస్ గ్లోబెల్ ఎన్నారై సెల్ నిర్వహిస్తున్న రజతోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్‌లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ యూత్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరంగల్ సభకు దీటుగా డాలస్ సభ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఖ్యాతి ఖం డాంతరాలు దాటగా ఆనాటి ఉద్యమంలో అమెరికా ఎన్నారైలు పాల్గొని కీలక భూమిక పోషించారని చెప్పారు. మూడోసారి కేసీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి పప్పులో కాలేశారని ఇక్కడి ఎన్నారైలు చెప్పారని పేర్కొన్నారు.