IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
IND vs WI | భారత్-వెస్టిండీస్ (India-West Indies) జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఐదో టీ20 (5th T20I) పై వరుణ నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రెండు జట్లు సిరీస్లో 2-2 తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఏ జట్టు విజేతగా నిలిస్తే ఆ జట్టే టైటిల్ ఎగరేసుకుపోనుంది. ఇలాంటి కీలకపోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది.
IND vs WI : భారత్-వెస్టిండీస్ (India-West Indies) జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఐదో టీ20 (5th T20I) పై వరుణ నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రెండు జట్లు సిరీస్లో 2-2 తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఏ జట్టు విజేతగా నిలిస్తే ఆ జట్టే టైటిల్ ఎగరేసుకుపోనుంది. ఇలాంటి కీలకపోరుకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొన్నది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
అయితే బెంగళూరులో ఈ రాత్రికి వర్షంపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో మ్యాచ్ జరుగుతుందా..? లేదంటే పూర్తిగా వర్షార్పణం అవుతుందా..? అనే ఉత్కంఠ నెలకొన్నది. వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం.. టాస్ సమయానికి వర్షంపడే అవకాశం 34-49 శాతం మధ్య ఉండనుంది. మ్యాచ్ తొలి మూడు గంటల్లో ఈ అవకాశం 34 శాతం నుంచి 40 శాతానికి పెరగవచ్చు. రాత్రి 10 గంటల సమయంలో వర్షంపడే అవకాశం ఏకంగా 78 శాతానికి చేరవచ్చని అక్యూవెదర్ పేర్కొన్నది.
చిన్నస్వామి స్టేడియంలో నీరు త్వరగా బయటకు వెళ్లేలా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ వర్షం కురిస్తే మ్యాచ్కు అంతరాయం తప్పకపోవచ్చు. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో ఇరు జట్లు రెండేసి విజయాలు సాధించాయి. సిరీస్ గెలవాలంటే భారత్ తన బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. మరోవైపు అర్ష్దీప్ సింగ్ ఫిట్నెస్ను బట్టి భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఆడే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

