‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ఉపాధి కోసం సెర్ప్ అందిస్తున్న వ్యక్తిగత రుణాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిసోర్స్ పర్సన్ కె.సునిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం కరకగూడెం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఎంపీఎం వినోద్ క్రాంతి సూచనల మేరకు మండల వీవోఏలకు...
కరకగూడెం, అక్టోబర్ 17 : ఉపాధి కోసం సెర్ప్ అందిస్తున్న వ్యక్తిగత రుణాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిసోర్స్ పర్సన్ కె.సునిల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం కరకగూడెం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఎంపీఎం వినోద్ క్రాంతి సూచనల మేరకు మండల వీవోఏలకు ఒక్కరోజు శిక్షణ కార్యాక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెర్ప్ ద్వారా ఉన్నటువంటి అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలు రూ.2 లక్షల నుండి వ్యాపార వృద్ధి కోసం రూ.20 లక్షల వరకూ రుణాలు మంజూరు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఎంచుకొనే యూనిట్ ఆధారంగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కొసం స్థానిక సెర్ప్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, విజయలక్ష్మీ, సత్యనారాయణ, వీవోఏలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

