పీర్జాదిగూడ, ఫిబ్రవరి 17: రాష్ట్రమంతా పచ్చదనం కనిపించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం రూపొందించారని గ్రీన్ చాలెంజ్ సృష్ట్లికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గురువారం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఆయన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, సీపీ మహేశ్ భగవత్, కార్పొరేటర్లతో కలిసి కమిషనరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. హరితహారం స్ఫూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను సామాజిక బాధ్యతగా తీసుకుని దేశంలోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఆయా సంస్థలు మొక్కలు నాటేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పచ్చదనం 33శాతం చేరువకు చేరిందని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ హరితహారం విజయవంతంలో పోలీసులూ భాగస్వాములు అయ్యారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ సంరక్షణ అధికారి అక్బర్, అదనపు కలెక్టర్ జాన్ శాంసన్, డిప్యూటీ మేయర్ శివకుమార్, కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, బండి రమ్యసతీశ్ గౌడ్, అనంతరెడ్డి, యుగేంధర్‌రెడ్డి, శారదా ఈశ్వర్ రెడ్డి, ప్రసన్నలక్ష్మీ శ్రీధర్‌రెడ్డి, మంజుల రవీందర్, పాశం శశిరేఖ బుచ్చి యాదవ్, నాయకులు బండి సతీశ్ గౌడ్, కృష్ణగౌడ్ వార్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.