వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం : వాట్సాప్
వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం : వాట్సాప్ |

న్యూఢిల్లీ : వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఇటీవల కంపెనీ తీసుకువచ్చిన నూతన ప్రైవసీ పాలసీ విధానంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాట్సాప్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల గోప్యతే మాకు ప్రధానమని హామీ ఇచ్చామని పేర్కొంది. కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదని, రాబోయే రోజుల్లో వాట్సాప్ కార్యాచరణలో ఏ మార్పులుండవని చెప్పింది.
అయితే, వినియోగదారులకు ప్రైవసీ పాలసీపై అప్డేట్ను ఇస్తూనే ఉంటామని తెలిపింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు వాట్సాప్ అకౌంట్లు, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. తాము ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని ఇంకా ఆమోదించని యూజర్ల అకౌంట్లు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయని తెలిపింది. ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో మే 15 నుంచి అమలు చేయాలని వాట్సాప్ సూచించిన నూతన ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్రం ఈ నెల 18న వాట్సాప్ ప్రతినిధులకు లేఖ రాసింది.
వారంలోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. సమాచార మార్పిడి కోసం చాలా మంది భారతీయులు వాట్సాప్‌పై ఆధారపడుతున్నారని, ఐరోపాలోని వినియోగదారులతో పోలిస్తే భారతీయులపై వాట్సాప్ వివక్షతో వ్యవహరిస్తోందని కేంద్రం నోటీసుల్లో ప్రస్తావించింది. కొత్త ప్రైవసీ పాలసీకి మే15 వరకు గడువు విధించగా.. అనంతరం దాన్ని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్ సంస్థ ఇటీవల ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
తుఫాను బాధిత ప్రజలకు అండగా ఉండాలి : రాహుల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

