వాషింగ్టన్, సెప్టెంబర్ 10: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండు నాల్కల ధోరణిని కొనసాగిస్తున్నారు. ఒక పక్క రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్టు మంగళవారం పోస్ట్ పెట్టిన ఆయన మరో పక్క రష్యాపై ఆర్థిక ఒత్తిడి తేవడానికి భారత్‌పై 100 శాతం సుంకాలను విధించాలని యూరోపియన్ యూనియన్(ఈయూ)ను కోరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా భారత్‌పై 100 శాతం సుంకాలు విధించాలని ఈయూ అధికారులకు ట్రంప్ మంగళవారం విజ్ఞప్తి చేశారు. కాగా, చైనాపై కూడా 100 శాతం సుంకాలు విధించాలని ఆయన ఈయూను కోరారు. వాషింగ్టన్ విచ్చేసిన ఈయూ ప్రతినిధి బృందంలోని డేవిడ్, ఇతర అధికారులతో కాన్ఫరెన్స్ కాల్లో ట్రంప్ మాట్లాడారు.