e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News వ‌చ్చే ఏడాది గేట్ నిర్వ‌హించ‌నున్న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌

వ‌చ్చే ఏడాది గేట్ నిర్వ‌హించ‌నున్న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌

వ‌చ్చే ఏడాది గేట్ నిర్వ‌హించ‌నున్న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌

కోల్‌క‌తా: వ‌చ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ (గేట్) ప‌రీక్ష‌ను ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ నిర్వ‌హించ‌నున్న‌ది. ఈ ఏడాది నిర్వ‌హించ‌నున్న గేట్ ప‌రీక్ష‌లో రెండు కొత్త పేప‌ర్ల‌ను చేర్చాల‌ని నేష‌న‌ల్ కోఆర్డినేష‌న్ బోర్డ్ (ఎన్‌సీబీ) నిర్ణ‌యించింది. గేట్ నిర్వహించే బాధ్య‌త‌ను ఐఐటీ బొంబాయి అధికారికంగా ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు అప్ప‌గించింది.

ఇదే సమయంలో తదుపరి గేట్ పరీక్ష కోసం రెండు కొత్త పేపర్లను చేర్చాలని ఎన్‌సీబీ నిర్ణయించింది. ప్రస్తుతం 27 సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తుండ‌గా.. వ‌చ్చే ఏడాది రెండు కొత్త పేపర్లను చేర్చ‌నున్నారు. నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ నావల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్‌ను ఒక పేపర్‌గా.. జియోమాటిక్స్ ఇంజనీరింగ్‌ను రెండవ పేపర్‌గా చేర్చాలని నిర్ణయించారు. అలాగే హ్యుమానిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కూడా చేర్చబడ్డాయి. అలాగే, ఏటా అభ్యర్థుల సంఖ్య పెరుగుతున్నందున 2022 పరీక్షకు కేంద్రాల సంఖ్యను కూడా పెంచాలని యోచిస్తున్నారు.

గేట్ 2022 క‌న్వీన‌ర్‌గా ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ తివారీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గేట్ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. అదే సమయంలో ఈ పరీక్ష మ‌ల్టిపుల్ క్వ‌శ్చ‌న్స్‌ లేదా MCQ ఆధారిత పరీక్షగా ఉంటుంది. పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

వైర‌స్ మూలాన్ని తిరిగి ప‌రిశీలించాలి : అమెరికా

క‌నువిందు చేస్తున్న‌ హిమాల‌యాలు

గాజాను పున‌ర్నిర్మిస్తామ‌ని ఇజ్రాయెల్‌కు అమెరికా హామీ

అర‌టితో ఏమేం పోష‌కాలు అందుతాయంటే..?

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో విస్త‌రిస్తున్న తాలిబాన్‌.. మూడు జిల్లాలు స్వాధీనం

మయన్మార్‌లో అంతర్యుద్ధానికి అవ‌కాశాలు : యూఎన్ హెచ్చరిక‌

విరాట్ సేన‌కు వెట‌ర‌న్ క్రికెట‌ర్ రిచ‌ర్డ్ హాడ్లీ ప్ర‌శంస‌లు

ఒలింపియన్ సుశీల్ కుమార్‌ను సస్పెండ్ చేసిన రైల్వే

సీబీఐ డైరెక్ట‌ర్ ఎంపిక : జ‌స్టిస్ ర‌మ‌ణ అభ్యంత‌రంతో ఇద్ద‌రి పేర్లు ఔట్‌..?!

అమ‌రీంద‌ర్‌కు ప‌క్క‌లో బ‌ళ్లెంలా సిద్దూ

న‌క్స‌ల్స్‌ దాడిలో కాంగ్రెస్ నేత‌ల మృతి.. చ‌రిత్ర‌లో ఈరోజు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వ‌చ్చే ఏడాది గేట్ నిర్వ‌హించ‌నున్న ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌

ట్రెండింగ్‌

Advertisement