చెన్నూర్, ఫిబ్రవరి 24: సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇక్కడి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేద ని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను ఎవరైనా పలుచన చేసినట్టు మాట్లాడితే వారి చెంప చెళ్లుమనేలా నిలదీయాలని మహిళలకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 569 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడు తూ.. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఇబ్బందులు పడకూడదని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకం కింద రాష్ట్రంలో పది లక్షల మందికిపైగా లబ్ధిపొందిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇ లాంటి పథకం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించారు. వచ్చే రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నియోజక వర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆయన లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.