మక్తల్ : కాంగ్రెస్ ( Congress ) అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్( BRS) నర్వా మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నిర్వాహకానికి హైకోర్టు మెట్టికాయలు వేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నాడని, రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని మరొక్కసారి పన్నాగం పన్నారని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకువెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పల్లె తీర్పు నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన అనుమతుల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి తమ ప్రభుత్వంలో వచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో చిట్టెం సుచరిత రెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో వైస్ చైర్మన్ లక్ష్మణ్, మరికల్ మాజీ ఎంపీపీ శశికళ రాజవర్ధన్ రెడ్డి, నాయకులు దండు అయ్యప్ప, విజయ్, జనార్ధన్, అశోక్, శంకర్, శేఖర్ యాదవ్, రాజారెడ్డి, నరసింహ, మాధవరెడ్డి లతోపాటు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.