తలమడుగు, జూలై 1 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో కల్వర్టు నిర్మాణానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లి(బీ) గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని కల్వర్టులను పరిశీలించారు. తిరుగు ప్రయాణంలో వీధిలో కూర్చొని బీడీలు చేస్తున్న మహిళలను ఎమ్మెల్యే సరదాగా పలకరించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, నాయకులు కేదారేశ్వర్ రెడ్డి, అబ్దుల్లా, శ్రీనివాస్, సుంకిడి సర్పంచ్ ప్రకాశ్, మున్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.