Pawan Kalyan | తనకు 21 ఏండ్లు ఉన్నప్పుడే రాజకీయ ఆలోచనలు మొదలుపెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. అప్పుడే కమ్యూనిజం చదివానని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సేనతో సేనాని కార్యకమంలో జన సైనికులు, వీర మహిళలతో శనివారం నాడు పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికలో ఓడిపోయినందుకు ఆనందంగా ఫీలయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2019లో ఓడిపోయినప్పుడు అందరూ నవ్వుతారని ముందే తెలుసని పవన్ కల్యాణ్ తెలిపారు. కష్టాలు ఎలా ఉంటాయో భగవంతుడు తనకు చూపించాడని అన్నారు. ఓడిపోయిన తర్వాత మిగతావారిని ట్రాక్‌లో పెట్టేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. అవమానాలు పడేవాడు, ఆశలు గుండెనిండా నింపుకున్న వాడు ముందుకు వెళ్లలేడని.. ఆశయాలు గుండెల్లో నింపుకుంటేనే ముందుకెళ్తారని అన్నారు. గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే.. తాను మాటలు పోగేసుకుంటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. చూడ్డానికి నేను మీకు దూరంగా ఉన్నా.. జనసేన పార్టీలో భావజాలం మన అందర్నీ దగ్గర చేసిందని జనసైనికులు, వీరమహిళలతో పవన్ కల్యాణ్ అన్నారు.
జనం కోసం జనసేన నిరంతరం నిలబడుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యం సిద్ధమవుతుందని పేర్కొన్నారు. పార్టీని నిలబెట్టేందుకే సినిమాలు చేస్తున్నానని వెల్లడించారు. సినిమాల వల్లే తాను ఇంతమందికి చేరువయ్యాయని చెప్పారు. అక్టోబర్ నుంచి పార్టీ కేడర్‌తో సమావేశమవుతానని తెలిపారు. తనకు కులం, మతంతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
Follow Us : on Facebook, Twitter
IAS Shiva Shankar | ఏపీకి మరో ఐఏఎస్ కేటాయింపు.. శివశంకర్‌ను పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు
Kotamreddy Sridhar Reddy | సంచలన వీడియోలో ఉన్నది కోటంరెడ్డి అనుచరులేనా!-
Kotamreddy Sridhar Reddy | ఎమ్మెల్యే కోటంరెడ్డి హత్యకు భారీ స్కెచ్.. సంచలనం రేపుతున్న వీడియో-
Kethireddy | సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న కేతిరెడ్డి.. ఈసారైనా తాడిపత్రిలో అడుగుపెడతారా?