Kotamreddy Sridhar Reddy | నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్‌కు భారీ కుట్ర జరిగినట్లు తెలిసింది. కోటంరెడ్డి హత్య గురించి ఐదుగురు రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్న ఒక వీడియో ఒకటి బయటకొచ్చింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ రౌడీషీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కాగా, ఈ వీడియోలో ఉన్న రౌడీషీటర్లను జగదీశ్, మహేశ్, వినీత్‌గా గుర్తించారు. వీరిలో జగదీశ్.. నెల్లూరు రౌడీషీటర్ శ్రీకాంత్‌కు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.
ఫుల్లుగా మద్యం తాగి జగదీశ్, మహేశ్, వినీత్‌లు మరో ఇద్దరితో చర్చించినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. గదిలో మొత్తం ఏడుగురు ఉండగా, అందులో ఒక్కరే వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ ద్వారా జగదీశ్ పథకం రచించారని కోటంరెడ్డి వర్గీయులు చెబుతున్నారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియోలో ఉన్న అంశంపై తమ దృష్టిలో ఉందని నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి విషయం చెబుతామని చెప్పారు. ఇక ఈ వీడియోపై ఎమ్మెల్యే కోటంరెడ్డి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కంటే కూడా తనకు తన ప్రాణాలే ముఖ్యమని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియో వైరల్
మద్యం తాగుతూ వీడియో తీసుకున్న రౌడీషీటర్లు
కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ సంభాషణ
వీడియోలో ఉన్న రౌడీషీటర్లు శ్రీకాంత్, జగదీష్, మహేష్, వినీత్ గా గుర్తింపు pic.twitter.com/Atoj8VhFga
— Telugu Scribe (@TeluguScribe) August 29, 2025