Mohammed Shami | భార్య హసీన్ జహాన్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ..!
Mohammed Shami | టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం, భార్య హసీన్ జహాన్‌తో కొనసాగుతున్న వివాదంపై తొలిసారిగా పెదవి విప్పాడు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తనపై వస్తున్న ఆరోపణలపై వాస్తవాలను వెల్లడించాడు.
Mohammed Shami | టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం, భార్య హసీన్ జహాన్‌తో కొనసాగుతున్న వివాదంపై తొలిసారిగా పెదవి విప్పాడు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తనపై వస్తున్న ఆరోపణలపై వాస్తవాలను వెల్లడించాడు. తాను గత విషయాలను పట్టించుకోనని, తన పూర్తి దృష్టి క్రికెట్ కెరీర్‌పై ఉందని పేర్కొన్నాడు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంపై అడిగిన ప్రశ్నకు షమీ కూల్‌గా సమాధానం ఇచ్చాడు. ‘ ఈవిషయాన్ని వదిలేయండి. గతం గురించి నేను ఎప్పుడూ బాధపడను. అది జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని నేను అనుకోవడం లేదు. నాకు నేను నిందించుకోవడం లేదు. ఇప్పుడు క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ వివాదాలు నాకు అవసరం లేదు’ అంటూ పేర్కొన్నారు. 2014లో హసీన్ జహాన్‌ను వివాహం చేసుకున్న షమీ.. నాలుగేళ్ల తర్వాత విడిపోయాడు. 2018 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
ఈ సమయంలో హసీన్ జహాన్ షమీపై, ఆయన కుటుంబంపై అనేక ఆరోపణలు చేసింది. గృహ హింస, మానసిక వేధింపులకు గురిచేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ నెలలో కూడా, షమీని వుమనైజర్గా పేర్కొంటూ.. తన సొంత కూతురికి కాకుండా గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఖరీదైన బహుమతులు ఇస్తున్నాడని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక షమీ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు. అయితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన షమీ, 9 మ్యాచ్‌లలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచారు. ఫామ్ కోల్పోవడంతో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో పాటు, సెప్టెంబర్‌లో జరుగబోయే ఆసియా కప్ 2025 టోర్నీకి సైతం దూరమైన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
Anant Singh | ‘నితీశ్ కుమార్ కోసం 9 మందిని చంపించా’.. జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

