Kamala Harris : డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ (Kamala Harris) భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్’ (Secrete Service Protection)ను రద్దు చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం శ్వేత సౌధం కార్యాలయం వెల్లడించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం మాజీ వైస్ ప్రెసిడెంట్‌కు పదవి ముగిసిన తర్వాత ఆరు నెలల పాటు ప్రత్యేక భద్రత కల్పిస్తారు.
ఈ నిబంధన ప్రకారమే హ్యారిస్‌కు సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ కేటాయించారు. అయితే.. జూన్ 21న ఈ గడువు ముగిసింది. దాంతో, అప్పటి ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) భద్రతను మరికొన్ని రోజులు పొడిగించారు. కానీ, హ్యారిస్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రతను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయంపై కమలా హ్యారీస్ అనుచురులు స్పందించారు. ‘యూనైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ అందించిన సేవలకు మేము కృతజ్ఞులం. వాళ్ల అంకితభావం, భద్రత విషయంలో రాజీ పడని వాళ్ల చిత్తశుద్దికి ధన్యవాదాలు’ అని ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (AFP)కు తెలిపారు.
Kamala Harris had her Secret Service protection cancelled by President Trump on Thursday.
Good. Having her escorted to go shopping at fancy stores had been a waste of our tax dollars.
Joe Biden had secretly extended her SS for a year.
Trump ended that. Kamala’s SS stops 9/1. pic.twitter.com/jwP4Z9F36D
— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) August 29, 2025
అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనిచేసిన తొలి మహిళగా కమలా హ్యారిస్ రికార్డు నెలకొల్పారు. అనంతరం అనుకోకుండా అధ్యక్ష పీఠం కోసం పోటీపడ్డారు కూడా. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అనారోగ్యం కారణంగా అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలిగడంతో హ్యారిస్ రేసులోకి వచ్చారు. ట్రంప్‌తో పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన ఆమె డిబేట్లోనూ అదరగొట్టారు. కానీ, అమెరికన్లు ట్రంప్ విధానాలకు ఆకర్షితులు కావడంతో హ్యారిస్‌కు ఓటమి తప్పలేదు. తన ఎన్నికల ప్రచారం, తనకు ఎదురైన అనుభవాలతో ఆమె ‘107 డేస్’ పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈ బుక్‌ను సెప్టెంబర్ 23న ఆవిష్కరించనున్నారు.